వేటగాడిపై పీడీ యాక్ట్

కోనరావుపేట,వెలుగు: వన్యప్రాణుల కోసం పంట పొలాల వద్ద కరెంట్ వైర్లతో షాక్ పెట్టి ఓ వ్యక్తి మృతికి కారణమైన నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదైనట్లు సీఐ కిరణ్ కుమార్ తెలిపారు.  కోనరావుపేట పీఎస్​ పరిధిలోని మర్రమడ్ల అటవీ ప్రాంతంలో  రైతు మృతికి కారణమైన  చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన పల్లపు దేవరాజుపై పీడీ యాక్ట్ అమలు చేయడానికి కలెక్టర్ అనురాగ్ జయంతి ఉత్తర్వులు జారీ చేశారు.

ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు   దేవరాజును  సీఐ కిరణ్ కుమార్, ఎస్సై రమాకాంత్  అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేసి శనివారం నిందితుడిని చర్లపల్లి కేంద్ర జైలుకు తరలించినట్లు  తెలిపారు.