మెట్ పల్లిలో రేషన్ బియ్యం పట్టివేత

మెట్ పల్లిలో రేషన్ బియ్యం పట్టివేత

మెట్ పల్లి, వెలుగు:  మెట్ పల్లిలో అక్రమంగా తరలిస్తున్న 13 క్వింటాలు రేషన్ బియ్యం పట్టుకున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని శాంతినగర్, మండలంలోని వెంపే గ్రామాల నుంచి రేషన్ బియ్యం తరలిస్తున్నారని పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి వెంపేట్ లో ఆరు క్వింటాళ్ళు, మెట్ పల్లి పట్టణంలో మోటార్ సైకిళ్ళ పై తరలిస్తున్న ఏడు క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నామని తెలిపారు. 

నిందితులు కడమంచి అంజి, అండ్రాస్ గంగాధర్, మొటం రమేశ్​, కొండపల్లి మారుతీల వద్ద నాలుగు మోటర్ సైకిళ్ళు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా రేషన్ బియ్యాన్ని ఇంటింటికీ తిరిగి సేకరించి కొండపల్లి మారుతీ కు అప్పగిస్తారని మారుతీ ఆ బియ్యాన్ని చుట్టుపక్కల కోళ్ళ ఫారంలకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటాడని సీఐ తెలిపారు.