- బాలికపై లైంగిక దాడికి యత్నించగా పోక్సో కేసు నమోదు
వరంగల్, వెలుగు : బాలికపై లైంగిక దాడికి యత్నించిన కేసులో సీఐని రెండు వారాలుగా అరెస్ట్ చేయని వరంగల్ పోలీసుల తీరుపై బాధిత కుటుంబ సభ్యులు, ప్రజలు మండిపడుతున్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధి మామునూర్పీఎస్ కు చెందిన సీఐ రవికుమార్ వడ్డేపల్లిలోని అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు. అదే అపార్ట్ మెంట్ లో ఉండే బాలికను గత అక్టోబర్ 9న సీఐ బెదిరించి తన గదిలోకి లాక్కెళ్లి లైంగికదాడికి యత్నించినట్టు బాధిత చిన్నారి తల్లిదండ్రులు కాజీపేట పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
అనంతరం అదే నెల 22న సీఐ రవికుమార్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం సీఐని మల్టీ జోన్ –1 ఐజీకి అటాచ్ చేశారు. కాగా.. రెండువారాలైనా సీఐని అరెస్ట్ చేయకపోవడంపై బాధితులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను అడిగితే పరారీలో ఉన్నాడని చెబుతున్నారు. మరోవైపు బాధిత కుటుంబాన్ని కాంప్రమైజ్ కావాలని పెద్దలతో ఒత్తిడి చేస్తున్నారని.. నిందితుడికి వరంగల్ పోలీసులు కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.