7 లోపు నష్టం వివరాలు సమర్పించండి

7 లోపు నష్టం వివరాలు సమర్పించండి
  • అధికారులను ఆదేశించిన సీఎస్​ శాంతి కుమారి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను 7వ తేదీలోగా సమర్పించాలని సీఎస్​శాంతి కుమారి ఆదేశించారు. వర్షాలు, వరదలతో జరిగిన నష్టం అంచనా వేయడంపై సెక్రటేరియెట్ లో వివిధ శాఖల కార్యదర్శులు, హెచ్​ఓడీలతో మంగళవారం సీఎస్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇప్పటికీ అనేక జిల్లాల్లో వానలు, వరదలు తగ్గుముఖం పట్టలేదని తెలిపారు.

జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి సంబంధిత శాఖల బృందాలను క్షేత్రస్థాయికి పంపి జీపీఎస్ కోఆర్డినేట్ లతో సహా సమర్పించాలని చెప్పారు. ప్రతి జిల్లాకో స్టేట్ డిజాస్టర్ మెనేజ్ మెంట్ ఫోర్స్ లను ఏర్పాటు చేయడానికి కావాల్సిన నిధులు, సిబ్బంది, పరికరాల వివరాలు వెంటనే సమర్పించాలని పేర్కొన్నారు. వర్షాలతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా వెంటనే తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.