మాదాపూర్, వెలుగు: రోడ్డు పక్కన నిలబడి ప్రజలకు ఇబ్బందులు కలగజేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాన్స్జెండర్లను మాదాపూర్ సీఐ కృష్ణ మోహన్ హెచ్చరించారు. మాదాపూర్ పీఎస్ లో 25 మంది ట్రాన్స్జెండర్లతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు.
రోడ్డుపై, సిగ్నల్స్ వద్ద వాహనదారులను డబ్బులు ఇవ్వాలని వేధించొద్దన్నారు. రోడ్ల పక్కన నిలబడి అసభ్యకర సైగలు చేస్తూ ఇబ్బందులు కలగజేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.