నాకు ప్రాణహాని ఉంది..ప్లీజ్ హెల్ప్ చేయండి... సీఐడీ నటి వీడియో

నాకు ప్రాణహాని ఉంది..ప్లీజ్ హెల్ప్ చేయండి... సీఐడీ నటి వీడియో

CID సీరిస్ లో పోలీస్ ఇన్ స్పెక్టర్ గా కనిపించి బాగా పాపులర్ అయిన నటి వైష్ణవి ధనరాజ్ ముంబై పోలీసులను ఆశ్రయించింది.  తన కుటుంబం  సభ్యులు తనపై  శారీరక హింసకు పాల్పడుతున్నా్రంటూ ఆరోపణలు చేసింది.  దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  తనను కాపాడాలంటూ ఈ వీడియోలో తెలిపింది.  ప్రస్తుతం తాను క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. 

 " నేను ఇబ్బందుల్లో ఉన్నాను..  నాకు  ప్రాణహాని  ఉంది. నన్ను బయటకు వెళ్లేందుకు మా కుటుంబం అనుమతించడం లేదు. ప్రస్తుతం నేను పోలీస్ స్టేషన్‌లో ఉన్నాను. దయచేసి నాకు మీడియా,  సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరి నుండి సహాయం కావాలి. దయచేసి వచ్చి నాకు సహాయం చేయండి"  అంటూ  వైష్ణవి తెలియజేసింది.  వీడియోలో ఆమె ముఖం, పెదవులు, కుడి చేయి, మణికట్టుపై గాయాలు అయినట్టుగా కనిపిస్తున్నాయి. 

వైష్ణవి తన కుటుంబ సభ్యులపై నాన్-కాగ్నిసబుల్ ఫిర్యాదు చేసినట్లు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.   కాగా  వైష్ణవి నటుడు నితిన్ షెరావత్‌ను 2016లో వివాహం చేసుకుంది. కొన్ని రోజులకు అతని నుంచి విడాకులు తీసుకుంది.   ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది.