
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏపీ సీఐడీ వేగం పెంచింది. ఢిల్లీలో ఇటీవల నారా లోకేష్‌కు నోటీసులు జారీ చేయగా తాజాగా మాజీ మంత్రి నారాయణకు సీఐడీ మరోసారి నోటీసులు పంపింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పై ఉన్న ఆయనకు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించింది సీఐడీ. 2023 అక్టోబర్ 4 బుధవారం రోజున విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. నారా లోకేష్ తో కలిసి విచారణకు కావాలని నోటీసుల్లో తెలిపింది.