
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు ఆయన్ను విజయవాడ వైపుకు రోడ్డు మార్గన తీసుకువెళ్తున్నారు. ఆయన కాన్వయ్ లోనే గిద్దలూరు, మార్కపురం, కుంట, వినుకొండ, నర్సారావుపేట, గుంటూరు, మంగళగిరి, మీదుగా రోడ్డు మార్గన తరలిస్తున్నారు. చంద్రబాబును విజయవాడకు తరలించి అక్కడ మూడోవ అదనపు కోర్టులో ఆయన్ను హాజరు పరుస్తారని తెలుస్తో్ంది.
మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామునే విశాఖలోని ఆయన నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు మీడియా సమావేశంలో సీఐడీ అదనపు డీజీ మాట్లాడనున్నారు. చంద్రబాబు అరెస్ట్ వివరాలను ఆయన వెల్లడించనున్నారు.