- ఐదేండ్లలో అదృశ్యమైన లక్ష మందిలో 60% మంది ప్రేమికులే..
- వీరిలో 17 నుంచి 28 ఏండ్ల మధ్య వయసున్న వాళ్లే ఎక్కువ
- ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడం వల్లే పరార్
- 85 శాతం ట్రేస్ చేసి పేరెంట్స్‌కు అప్పగిస్తున్న పోలీసులు
హైదరాబాద్, వెలుగు: తమ ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఏటా వేల మంది గడపదాటుతున్నారు. వీరిలో తెలిసీతెలియని వయస్సున్న మైనర్లు కూడా ఉంటున్నారు. గడిచిన ఐదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా మిస్సింగ్ కేసులు నమోదైతే.. అందులో సుమారు 60వేల మందికిపైగా ప్రేమికులే ఉన్నట్లు క్రైం రికార్డులు చెప్తున్నాయి. ఇలాంటి కేసులను ట్రేస్ చేస్తున్న సీఐడీ పోలీసులు, పెద్దల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి ప్రేమికులిద్దరూ మేజర్లయితే వారి ఇష్టానికి వదిలేస్తున్నారు. మైనర్లు అయితే పేరెంట్స్‌కు అప్పగిస్తున్నారు. పోలీసులు అతికష్టం మీద 85శాతం కేసులను ట్రేస్ చేస్తుండగా, మరో 15శాతం కేసులు మిస్టరీగా మిగిలిపోతున్నాయి.
ఐదేండ్లలో లక్షమందికిపైగా అదృశ్యం
గడిచిన ఐదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 1,03,496 మంది అదృశ్యం అయ్యారు. వీరిలో ప్రేమించుకొని, పెండ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో ఇంటి నుంచి పారిపోయిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. మొత్తం మిస్సింగ్ కేసుల్లో 60 శాతం వరకు ప్రేమికులే ఉంటున్నారని సీఐడీ ఎంక్వైరీలో తేలింది. గత ఐదేండ్లలో 1,03,496 మంది మిస్సింగ్‌కు సంబంధించి 96,614 వరకు కేసులు ఫైల్ అయ్యాయి. వీరిలో 97,028 మందిని సీఐడీ పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఈ ఏడాది నవంబర్ వరకు ఇలాంటి 22,780 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.
వీటిలో 19,191 కేసులను ఛేదించారు. మిస్సింగ్ కేసులను సాల్వ్ చేయడంలో స్టేట్ సీఐడీ 85 శాతం సక్సెస్ రేటు సాధించగా, మిగిలిన 15 శాతం కేసులు మిస్టరీగా మిగులుతున్నాయి. మిస్సింగ్ అయి దొరుకుతున్నవాళ్లలో కొందరి మానసిక పరిస్థితి సరిగా లేక అడ్రస్ చెప్పలేకపోతున్నారు. మరికొంత మంది చనిపోవడంతో జాడ దొరకడం లేదని పోలీసులు చెప్తున్నారు.
మిస్సింగ్ కేసుల్లో 20 శాతం మహిళలు
స్థానిక పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు నెలల్లోపు మిస్సింగ్ కేసులు ట్రేస్ కాకపోతే వాటిని సీఐడీకి ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. ఇలాంటి కేసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రిజిష్టర్ అయిన మిస్సింగ్ కేసులను స్టేట్ విమెన్ సేఫ్టీ వింగ్ ఛేదిస్తున్నది. మిస్సింగ్ కేసుల్లో 20శాతం మహిళలు ఉంటున్నారు. వీరిలో చాలా మంది గృహిణులు కాగా, వీరు కుటుంబ కలహాలతో ఇండ్ల నుంచి వెళ్లిపోతున్నారు. మరో 10 శాతం మంది 60 ఏండ్లుపైబడిన వృద్ధులు కాగా, 10 శాతం మంది చిన్నారులు ఉంటున్నారు. ఆలనాపాలన లేక చిన్నారులు, వృద్ధులు అదృశ్యమవుతున్నట్లు పోలీస్ రికార్డులు చెప్తున్నాయి.
ఇక ఇండ్ల నుంచి పారిపోతున్న ప్రేమికుల విషయంలో స్థానిక పోలీసులు ముందుగా మిస్సింగ్ కేసు నమోదు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అందించే సమాచారం ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మైనర్లు అదృశ్యమైనప్పుడు మాత్రమే కిడ్నాప్ కేసు పెట్టి, ఎంక్వైరీ చేస్తున్నారు. దర్యాప్తులో చాలామంది మైనర్లు ప్రేమ పేరుతో పారిపోతున్న విషయం తెలిసి పోలీసులు షాక్ అవుతున్నారు.
ALSO READ : తెలుగు మీడియం కనుమరుగు .. ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లలో అంతా ఆంగ్లమయమే
సోషల్ మీడియా ప్రభావమే ఇందుకు కారణమని చెప్తున్నారు. ప్రేమ పేరుతో పారిపోతున్న యువత ఎక్కువగా ఏపీలోని వివిధ ప్రాంతాలతో పాటు బెంగళూరు, ముంబై చేరుకుంటున్నారు. అక్కడ ఆర్థిక సమస్యలు తలెత్తగానే తిరిగి సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు.
2020 నుంచి 2024 (అక్టోబర్ 19) వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులు
సంవత్సరం 18 ఏండ్లలోపు మహిళలు పురుషులు మొత్తం