CMRF scam: సీఎంఆర్ఎఫ్ స్కాం..ట్రీట్ మెంట్ చేయకుండానే డబ్బులు కాజేసిన ఆస్పత్రులివే...

CMRF scam: సీఎంఆర్ఎఫ్ స్కాం..ట్రీట్ మెంట్ చేయకుండానే డబ్బులు కాజేసిన ఆస్పత్రులివే...

తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ స్కాంలో విచారణను వేగవంతం చేశారు  సీఐడీ పోలీసులు. ట్రీట్ మెంట్ చేయకుండానే నకిలీ పేర్లతో నిధులు స్వాహా చేసిన ఆస్పత్రులపై కేసు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 హాస్పటళ్లపై సిఐడి పోలీసులు కేసులు నమోదు చేశారు.

30 ఆస్పత్రులు నకిలీ పిల్లల పేర్ల మీద వందల కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసారని నిర్ధారణ అయ్యింది. ఆస్పత్రి సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు కలిసి నిధులు కొట్టేసారని పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో గుర్తించారు. సచివాలయంలోని సిఎంఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుపై సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.  

ALSO READ | సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కాం ట్రీట్‌మెంట్ చేయకుండా నకిలీ పేర్లతో నిధులు స్వాహా

గ్రేటర్ హైదరాబాద్ లో  10 హాస్పటళ్లు, ఖమ్మం లో 10, నల్గొండ 4, కరీంనగర్‌ 2, వరంగల్‌ 1, మహబూబాబాద్‌ 2, హాస్పటళ్లపై ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పేషెంట్లు లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండానే  బోగస్ బిల్లులతో ఆస్పత్రులు లక్షల్లో ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టాయి ఆస్పత్రులు .

గ్రేటర్ హైదరాబాద్

  • అరుణశ్రీ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్
  • శ్రీకృష్ణ హాస్పిటల్
  • హిరణ్య హాస్పిటల్
  • జనని హాస్పిటల్
  • డెల్టా హాస్పిటల్
  • శ్రీరక్ష హాస్పిటల్
  • ఎంఎంఎస్ హాస్పిటల్
  • ఏడీఆర్ఎం మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ 
  • ఎంఎన్వీ ఇందిరా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్
  •  శ్రీసాయి తిరుమల హాస్పిటల్

నల్లగొండ జిల్లా

  • నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
  •  మహేశ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 
  • అమ్మ హాస్పిటల్
  • కరీంనగర్ 
  • సప్తగిరి హాస్పిటల్ 
  • శ్రీసాయి హాస్పిటల్

వరంగల్ 

  •  రోహిణి మెడికేర్ ప్రైవేట్) లిమిటెడ్
  •  శ్రీ సంజీవని హాస్పిటల్ 
  • సిద్ధార్థ హాస్పిటల్
  • హస్తినాపురం 

ఖమ్మం

  • గ్లోబల్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ 
  • డా.జె.ఆర్.ప్రసాద్ హాస్పిటల్
  • శ్రీవినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
  • శ్రీసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
  • వైష్ణవి హాస్పిటల్, సుజాత హాస్పిటల్ 
  • న్యూ అమృత హాస్పిటల్
  • ఆరెంజ్ హాస్పిటల్
  • మెగాశ్రీ హాస్పిటల్
  • శ్రీ శ్రీకర మల్టీస్పెషాలిటీ హాస్పిటల్.