జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గల్ఫ్ ఏజెంట్ల ఇళ్లలో సీఐడీ అధికారులు సోదాలు కలకలం రేపుతున్నాయి. కోరుట్ల టౌన్ లోని ముగ్గురు పాస్ పోర్టు, గల్ఫ్ ఏజెంట్ల ఆఫీసులు, ఇండ్లపై మూడు బృందాలుగా సీఐడీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు.
ఫేక్ పాస్ పోర్టు స్వాధీనం చేసుకున్న సీఐడీ అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇద్దరు డీఎస్పీలు పదిమంది సీఐలు 10 మంది ఎస్సైలు 8 బృందాలుగా ఏర్పడి పాస్ పోర్ట్, గల్ఫ్ ఏజెంట్ల ఇండ్లు ఆఫీసులపై ఆకస్మిక తనిఖీలు చేసినట్లుగా సమాచారం.