ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు

ఏపీ బేవరేజీస్ కార్పొరేష్‌ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి నివాసంలో ఏపీ సీఐడీ అధికారుల సోదాలు చేస్తున్నారు.  ఉదయం మూడు వాహనాల్లో వచ్చిన ఏపీ పోలీసులు హైదరాబాద్‌ నానక్‌ రామ్‌ గూడలోని వాసుదేవ రెడ్డి ఇంట్లో ఉదయం నుంచి  సోదాలు చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ హయాంలో  వైసీపీకి లబ్ధి చేకూరేలా భారీ  ఎత్తున  మద్యం సరఫరా చేశారని ఆయనపై ఫిర్యాదులున్నాయి.  నూతన మద్యం విధానం పేరుతో వైసీపీ నేతలకు లబ్ధి కలిగేలా పనిచేశారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.  

ఏపీలో జే-బ్రాండ్‌ మద్యం తీసుకురావడంలో వాసుదేవరెడ్డిది కీలకపాత్ర అని, డిస్టిలరీలన్నీ అనధికారికంగా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లడంలో ఆయన కీ రోల్ పోషించారన్న ఆరోపణలున్నాయి. ఏపీలో మద్యం ధరల్ని పెంచడం, ఊరు పేరు లేని మద్యం బ్రాండ్లను విక్రయించడంలో వేల కోట్ల రుపాయల అక్రమాలు జరిగాయని ఐదేళ్లుగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి   రాజకీయ పార్టీల ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం వాసుదేవరెడ్డిని బేవరేజెస్ కార్పొరేషన్‌ పదవి నుంచి తప్పించింది.