
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేయాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్, సైబరాబాద్లో నమోదైన కేసులన్నింటిని సీఐడీ విచారణకు అప్పగించాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. హైదరాబాద్లో 11 మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
సైబరాబాద్లో బెట్టింగ్ యాప్స్ను ప్రోత్సహిస్తూ ప్రచారం చేసిన 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అగ్ర హీరోల దగ్గర నుంచి యూట్యూబర్ల వరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ సంస్థలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు విష్ణుప్రియ, రీతూ చౌదరి, యాంకర్ శ్యామలను హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే పిలిచి విచారించారు.
దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, ప్రకాశ్‌రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, వాసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్హసాయి, భయ్యా సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతూచౌదరి, బండారు శేషయాని సుప్రితపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సైబరాబాద్ కమిషనరేట్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్ తదితరులు ఉన్నారు.
ALSO READ : హైకోర్టును ఆశ్రయించిన విష్ణుప్రియ
మొత్తం 25 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. వీరిలో సినీ సెలబ్రెటీలతో పాటు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఉన్నారు. వీళ్లపై 318(4),112 రెడ్ విత్ 49 బీఎన్‌ఎస్3,3(ఏ), 4 తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్, 66-డి ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్చేసినందుకు ఇప్పటికే 11 మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇప్పుడు ఈ 11 మందిపైనా మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.