గోవిందా.. గోవిందా : తిరుమల ఘాట్ రోడ్డులో మందు బాటిళ్లు, సిగరెట్ ప్యాకెట్లు.. అసలు ఎలా వచ్చాయి కొండపైకి..?

గోవిందా.. గోవిందా : తిరుమల ఘాట్ రోడ్డులో మందు బాటిళ్లు, సిగరెట్ ప్యాకెట్లు.. అసలు ఎలా వచ్చాయి కొండపైకి..?

తిరుమల కొండా.. తిరుమల కొండ అని దేవదేవుడిని మొక్కుతూ ఏడుకొండలు ఎక్కటం మొదలుపెడతారు భక్తులు.. అలిపిరి మార్గంలోనే ప్రతి ఒక్కరినీ.. ప్రతి వాహనాన్ని క్షణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తారు.. మనుషులను స్కాన్ చేయటమే కాదు.. మన వస్తువులను సైతం స్కాన్ చేస్తారు.. అంతేనా ప్రతి వాహనాన్ని అణువణువూ తనిఖీ చేసి మరీ పంపించే వ్యవస్థ ఉంది.. ఇలా చెక్ చేసిన తర్వాతనే అలిపిరి దాటి.. ఏడుకొండలు ఎక్కుతారు మనుషులు అయినా.. వాహనం అయినా.. అలాంటిది ఇప్పుడు తిరుమల ఘాట్ రోడ్డులో.. ఏడుకొండలపై గుట్టలు గుట్టలుగా సిగరెట్ ప్యాకెట్లు, మందు బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లు దర్శనం ఇవ్వటం సంచలనంగా మారింది. అసలు అలిపిరి నుంచి ఇంత పెద్ద స్థాయిలో మత్తు పదార్థాలు ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

తిరుమల ఘాట్ రోడ్డులో గుట్టలు గుట్టులుగా గుట్కా, సిగరెట్ ప్యాకెట్లు, మందు బాటిళ్ళు దర్శనమివ్వటం కలకలం రేపుతోంది. తిరుపతి నుండి తిరుమలకు వెల్లే మార్గంలో 15 వ మైలు రాయి దగ్గర చోటు చేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశం అయ్యింది. పవిత్రతకు, కట్టుదిట్టమైన భద్రతకు మారుపేరైన తిరుమలలో చోటు చేసుకున్న ఈ ఘటన చాలా అనుమానాలకు దారి తీస్తోంది. రెండవ ఘాట్ రోడ్డు పక్కన గుట్కా ప్యాకెట్లు, ఖాళీ మందు బాటిళ్ళు పడి ఉండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి వాతావరణం చూస్తే ఆ దేవదేవుని సన్నిధికి వెళ్లే దారి మందు బాబులకు అడ్డాగా మారినట్లుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. 

ALSO READ : తిరుమలలో కొనసాగుతున్న భ‌క్తుల రద్దీ

అలిపిరి టోల్ గేట్ దగ్గర తనిఖీలు దాటుకొని ఇంత యదేచ్చగా తిరుమలకు నిషేధిత పదరార్థాలు ఎలా వచ్చాయంటూ ప్రశ్నిస్తున్నారు భక్తులు. ఇటీవల రాత్రి సమయంలో ఘాట్ రోడ్డు పక్కనే అసాంగీక కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత టీటీడీ అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు.  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని.. మత్తు పదరార్థాలు, నిషేధిత పదార్థాలు తిరుమల కొండపైకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు.