
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ టెక్ పార్క్‌లో కొత్త ఆఫ్‌షోర్ డెలివరీ సెంటర్ (ఓడీసీ) ను సిగ్నిటీ టెక్నాలజీస్ ఓపెన్ చేసింది. 40 వేల చదరపు అడుగుల్లో ఈ ఆఫీస్ విస్తరించి ఉంది. ఒకేసారి 400 మంది ప్రొఫెషనల్స్ పనిచేసుకోవడానికి వీలుంటుందని కంపెనీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఫ్యూచర్‌లో డిజిటల్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని తెలిపింది. కొత్త ఏడాదిలోకి ఎంటర్ అయ్యే ముందు ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌తో కొత్త అవకాశాలు క్రియేట్ అవుతాయని కంపెనీ సీఈఓ చక్కిలం శ్రీకాంత్ పేర్కొన్నారు. తమ ఉద్యోగుల కోసం వరల్డ్ క్లాస్ పని వాతావరణాన్ని క్రియేట్ చేశామని అన్నారు.