- కేంద్రానికి సీఐఐ సూచన
న్యూఢిల్లీ: ప్రయారిటీ సెక్టార్లకు ఇచ్చే లోన్ల విషయంలో సంస్కరణలు తీసుకురావాలని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) కేంద్రానికి సలహా ఇచ్చింది. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ఇనీషియేటివ్స్, హెల్త్‌కేర్ వంటి సెక్టార్లను ప్రయారిటీ సెక్టార్లుగా గుర్తించాలని పేర్కొంది. కొత్తగా అభివృద్ధి చెందుతున్న సెక్టార్లకు లోన్లు ఇచ్చేందుకు డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్ల (డీఎఫ్‌ఐ)ను ఏర్పాటు చేయాలని కోరింది. కాగా, దేశ నిర్మాణానికి సాయపడే కీలక సెక్టార్లను ఆర్థికంగా సపోర్ట్ చేసేందుకు ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ విధానాన్ని ఆర్‌బీఐ తీసుకొచ్చింది. బ్యాంకులు ఇచ్చే లోన్లలో కొంత భాగం ఈ సెక్టార్లకు కేటాయించాల్సి ఉంటుంది.