
హైదరాబాద్, వెలుగు : సీఐఐ తెలంగాణ ఎంఎస్ఎంఈ సమ్మిట్ 2024 హైదరాబాద్‌లో శుక్రవారం జరిగింది. ఎస్‌ఎంఈలను సాధికారం చేయడం, వాటి ముఖ్య సవాళ్లను పరిష్కరించడం, అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా సదస్సును నిర్వహించామని సీఐఐ తెలిపింది. ఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లు, మార్కెట్ విస్తరణ వంటి అంశాలపై చర్చ జరిగిందని పేర్కొంది.
ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ మాట్లాడుతూ మెరుగైన సాంకేతికతలపై పెట్టుబడి ఎంఎస్ఎంఈల వృద్ధికి బలమైన పునాది వేస్తుందని చెప్పారు. ఎంఎస్ఎంఈలు క్రెడిట్ యాక్సెస్, టెక్నాలజీ యాక్సెస్, మొదలైన సమస్యలను ఎదుర్కొంటున్నాయని, వీటి అధిగమించడానికి క్రమబద్ధమైన విధానం అవసరమన్నారు.