తెలుగు వాడైన తమిళ సినీ హీరో విశాల్ కోలీవుడ్ లో ఇప్పటికే తన సత్తా ఏంటో చాటాడు. నిర్మాతల సంఘం, నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు. ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. గతంలోనే జయలలిత చనిపోవడంతో ఆర్కే నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి విశాల్ రెడీ అయ్యాడు. నామినేషన్ కూడా వేశాడు. అయితే నామినేషన్ ను ప్రతిపాదించిన 10 మందిలో కొంత మంది మద్దతును ఉపసంహరించుకోవడంతో… ఆ నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విశాల్ రెడీ అవుతున్నాడు.
త్వరలోనే తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో చెన్నైలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని విశాల్ అనుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి తన అభిమాన సంఘాల నేతలతో చర్చలు కూడా జరుపుతున్నాడు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాడనేది ..త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నాడు విశాల్.