వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రధానం చేసే పద్మశ్రీ అవార్డు గ్రహీతల్ని కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కి కేంద్రం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. కళల విభాగంలో నటనా రంగంలో ప్రతిభ కనబర్చినందుకు పద్మ భూషణ్ అవార్డు వరించినట్లు తెలుస్తోంది. అయితే హీరో బాలకృష్ణ మరోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ పేషేంట్స్ కి సేవలు అందిస్తున్నాడు. తమ అభిమాన హీరోకి పద్మ భూషణ్ అవార్డు రావడంతో ఫ్యాన్స్ అనందం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ వెటరన్ హీరోయిన్ శోభన కి కూడా పద్మభూషణ్ అవార్డు లభించింది. నటి శోభన హీరోయిన్ గా మాత్రమే కాకుండా భరతనాట్యం డ్యాన్సర్ గా పలు ప్రదర్శనలు ఇచ్చింది. తమిళ్ హీరో అజిత్ కుమార్ కి పద్మభూషణ్ అవార్డు వరించింది. కర్ణాటక నుంచి కేజీయఫ్ మూవీ ఫేమ్ నటుడు, రైటర్ అనంత్ నాగ్ కి పద్మభూషణ్ అవార్డు లభించింది. ఇక బాలీవుడ్ నుంచి అరజిత్ సింగ్ (పద్మశ్రీ), శేఖర్ కపూర్ (పద్మభూషణ్) తదితరులకి అవార్డులు లభించింది.