రాజకీయాలపై ఆసక్తి లేదు : హీరో సుమన్

సూర్యాపేట, వెలుగు : రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని  సినీ హీరో సుమన్ అన్నారు. ఆదివారం ఖమ్మంలోని కరాటే ప్రోగ్రామ్‌లో పాల్గొని హైదరాబాద్ వెళ్తున్న ఆయన సూర్యాపేటలో ఆగారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా సుమన్ యువసేన అధ్యక్షుడు గుండా వెంకన్న  ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారా..?

అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని చెప్పారు.   తాను ఎన్నికల్లో పోటీ  చేస్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని కోరారు.  సుమన్ యువసేన సభ్యులు కర్నాటి రంగయ్య, గోపారపు రాజు, బొల్లం సురేశ్, గుడిపాటి రమేశ్, విజయకుమార్ ఉన్నారు.