వెండితెర మీద సక్సెస్ సాధించినవాళ్ల నెక్స్‌ట్ స్టెప్ రాజకీయాలే! అప్పటికే జనంలో పాపులారిటీ సాధించిన స్టార్లు రంగంలోకి దిగడంతో వాళ్ల వాయిస్ తేలిగ్గా ప్రచారంలోకి వెళ్లిపోతుంది. రాజకీయంగా తలపండినవాళ్లు సైతం వీళ్ల దెబ్బకు విలవిలలాడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ చేతిలో హెచ్ .ఎన్.బహుగుణ లాంటి నాయకుడు ఓడిపోయాడు. సునీల్ దత్ ముందు రాం జెఠ్మలానీ నిలబడలేకపోయాడు. అలాం టి ప్రముఖులను ఓడిం చినవాళ్లలో కొంతమంది గురించి తెలుసుకుందాం.
రాజకీయాల్లోకి సినీ ఆర్టిస్టు లు రా వడం ఎప్పటినుంచో ఉన్నదే. కేవలం హీరో, హీరోయిన్సే కాదు కమెడియన్లు, క్ యారెక్టర్ ఆర్టిస్టు లు కూడా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల్లో అప్పటికే ఉద్దండులుగా పేరొందిన వారిని ఢీ కొని గెలిచారు. తాజాగా కాంగ్రెస్ లో చేరిన హిందీ నటి ఊర్మిళా మటోండ్కర్ ముంబై నార్త్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ గోపాల్ చిన్నయ్య శెట్టిపై నిలబడ్డారు. 2014 లోక్ సభ ఎన్ని కల్లో కాంగ్రెస్ టి కెట్ పై పోటీ చేసిన సంజయ్ నిరుపమ్‌ని 4,46,582 ఓట్ల మెజా రిటీతో ఓడించిన చరిత్ర చిన్నయ్య శెట్టిది. మే 23న వె లువడే ఫలితాల్లో ఊర్మిళా మటోండ్కర్ గనుక విజేతగా నిలిస్తే పొ లిటికల్ హెవీ వెయిట్స్ ను ఓడిం చిన సినీ ఆర్టిస్టుల జాబితాలో ఆమె పేరు కూడా చేరుతుంది.
1984 లో ఇందిరా గాం ధీ హత్య తరువాత అమితాబ్ బచ్చన్ , వైజయంతిమాల, సునీల్ దత్ కాం గ్రెస్ లోకి ప్రవేశించిన తొలి తరం బాలీవుడ్ స్టార్లు . అమితాబ్ బచ్చన్ ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. హేమావతి నందన్ బహుగుణ ఇక్కడ అమితాబ్‌కి ప్రత్యర్థి . బహుగుణ ఉత్తరాది పాలిటిక్స్‌లో చాలా సీనియర్. యూపీకి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1971లో కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. 1984లో భారతీయలోక్ దళ్ (బీఎల్ డీ) కేం డిడేట్ గా బహుగుణ పోటీ చేశారు. రాజకీయంగా తలపండిన బహుగుణ, ఏమాత్రం రా జకీయ అనుభవం లేని అమితాబ్ చేతిలో ఓడిపోయారు. ఈ ఓటమి తర్వాత బహుగుణ పొలిటికల్ కెరీర్ కి ఎండ్ కార్డ్ పడింది.
వైజయంతిమాల
1984 లోనే మద్రాస్ సౌత్ నియోజకవర్గం నుంచి కాం గ్రెస్ టి కెట్ పై జనతా పార్టీ అభ్యర్థి ఎరా సె ళియన్ పై గెలిచారు. మద్రాస్ సౌత్ సెగ్మెంట్ కి ఎరా సెళియన్ పాత కాపు. 1962 నుంచి 1977 వరకు వరుసగా ఇదే నియోజకవర్గం నుంచి
సెళియన్ గెలుస్తూ వస్తు న్నారు. అయితే, వైజయంతి మాల చేతిలో ఓటమి తప్పలేదు. 1984 ఎన్ని కల్లో ముంబై వాయవ్య నియోజకవర్గం ప్రముఖ లాయర్ రాం జెఠ్మలానీ పోటీకి దిగారు. అప్పటికే ఆయన ఈ నియోజకవర్గా నికి సిట్టింగ్ ఎంపీ. జెఠ్మలానీ పై సినీ నటుడు సునీల్ దత్ కాం గ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన జెఠ్మలానీపై 1,54,640 ఓట్ల మెజా రిటీతో సునీల్ దత్ గెలిచారు. తర్వాత జెఠ్మలానీ బీజేపీలో చేరారు. అమితాబ్ సమకాలీనుడైన నటుడు వినోద్ ఖన్నా 1998 లోక్ సభ ఎన్ని కల్లో రా జకీయాల్లోకి ప్రవేశించారు. పంజాబ్‌లోని గురుదాస్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇక్కడ ఆయనపై కాంగ్రెస్ కి చెందిన సు ఖ్ బన్స్ కౌర్ పోటీ చేశారు. అప్పటికే కౌర్ సిట్టింగ్ ఎంపీ. 1980 నుంచి 1996 వరకు అయిదుసార్లు ఆమె లోక్ సభలో ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. వినోద్ ఖన్నా సినీ గ్లామర్ ముందు కౌర్ నిలవలేకపోయారు. 1,06,833 ఓట్ల మెజారిటీతో సుఖ్ బన్స్ కౌర్ పై వినోద్ ఖన్నా గెలిచారు.
1999 లోక్ సభ ఎన్ని కల్లో రా జకీయ ప్రముఖులను ఓడిం చిన సినీ స్టార్లు ఇద్దరున్నారు. వీరే రాజ్ బబ్బర్ , శశి కుమార్. బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ ఆగ్రా నియోజకవర్గం నుంచి పోటీ చేసి సీనియర్ రాజకీయవేత్త భగవాన్ శంకర్ రా వత్‌ని ఓడిం చారు. అప్పటికే రావత్ ఆగ్రా సెగ్మెం ట్ కి మూడుసార్లు ప్రా తినిథ్యం వహించారు. మరో నటుడు శశి కుమార్ కన్నడ సినిమా పరిశ్రమకు చెందినవారు. 11,178 ఓట్ల మెజారిటీతో చిత్రదుర్గలో సిట్టింగ్ ఎంపీ ముదల్ గిరియప్పను శశి కుమార్ ఓడించారు. 2004 ఎన్ని కల విషయానికొస్తే బాలీవుడ్ నటుడు గోవింద పొ లిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ముం బై నార్త్ నియోజకవర్గం నుంచి కాం గ్రెస్ టి కెట్ పై పోటీ చేసిన గోవింద, బీజేపీ అభ్యర్థి రామ్ నాయక్ పై విజయం సాధించారు. రా మ్ నా యక్ అయిదు టర్మ్ లు లోక్ సభకు ఎన్ని కైన సీనియర్ లీడర్. ప్రస్తు తం రా మ్ నా యక్ యూపీ గవర్నర్ గా ఉన్నారు. ఇదే ఏడాది జరిగిన ఎన్ని కల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన బాలీవుడ్ నటి జయప్రద, యూపీలోని రాంపూర్ నుంచి సమాజ్ వాది పార్టీ టి కెట్ పై పోటీ చేసి బేగం నూర్ బానోను ఓడిం చారు. రాంపూ ర్ సంస్థాన వారసురా లైన నూర్ బానో అప్పటికే అక్కడ రెండు టర్మ్ లు ఎంపీగా పనిచేశారు.
2014 ఎన్ని కల్లో పశ్చిమ బెంగాల్ కి చెందిన నటీమణులు సంధ్యా రాయ్ , మూన్ మూన్ సేన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. వెస్ట్ బెం గాల్ లోని మెదినీపూర్ లోక్ సభ సెగ్మెంట్ నుంచి తృణమూల్ కాం గ్రెస్ టి కెట్ పై సంధ్యా రాయ్ పోటీ చేసి కమ్యూనిస్టు యోధుడు ప్రబోధ్ పాం డాని ఓడించారు. మూన్ మూన్ సేన్ బంకురా నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొమ్మిది సార్లు ఎంపీగా గెలిచిన సీపీఎం సీనియర్ లీడర్ బాసుదేవ్ ఆచార్యను ఓడించారు. బాసుదేవ్ పై మూన్ మూన్ సేన్ 98,506 ఓట్ల మెజా రిటీ సాధించారు. అలాగే హిందీ నటి హేమా మాలిని మథుర నియోజవర్గం నుంచి బీజేపీ టికెట్ పై పోటీ చేసి రా ష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) కేం డిడేట్ జయంత్ చౌధురిపై గెలిచారు. మొత్తం మీద సినీ స్టార్లగ్లా మర్పై రా జకీయ ప్రముఖుల గెలుపు చాలా కష్టమే ని చెప్పా లి. పాలిటిక్స్‌లోకి దిగితే చుక్కలు చూపిస్తామని సినీ ఆర్టిస్టులు నిరూపించుకున్నారు.
టాలీవుడ్ లోనూ తక్కువేమీ కాదు
తెలుగునాట సినీ తారల రా జకీయ ప్రవేశం ఎన్టీఆర్ తోనే మొదలు కాలేదు. అంతకుముందు 1967లో ఒంగోలు నుంచి క్ యారెక్టర్ యా క్టర్ కొంగర జగ్గయ్య పోటీ చేసి, కమ్యూనిస్టు యోధుడు మాదల నారా యణ స్ వామిపై గెలిచారు. అయితే, ఎన్టీఆర్ వచ్చేవరకు సినిమా–రాజకీయం మధ్య గ్యాప్ ఏర్పడింది. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టాక సినీ తారలు ఎక్కువగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అలనాటి హీరోయిన్లు జమున, శారద, క్యారెక్టర్ ఆర్టిస్టు కైకాల సత్యనారాయణ ఎంపీలుగా గెలిచారు. తెనాలికి చెందిన శారద 1996లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సొంత ఊరి నుంచే పోటీకి దిగారు. తెనాలి పార్లమెంటు స్థానంలో సీనియర్ కాం గ్రెస్ లీడర్ సింగం బసవపున్నయ్యపై గెలిచారు. అయితే, రెండేళ్లకే మధ్యం తర ఎన్ని కలు రా వడంతో 1998లో సెకండ్ టైమ్ పోటీకి దిగి, మాజీ కేంద్ర మంత్రి పి శి వశంకర్ పై ఓడిపోయారు.
దాదాపు రెండు దశాబ్దాలు హీరోయిన్ గా కొనసాగిన జూలూరి జమున రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచారు. ఆమె 1989లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థి , వ్యాపారవేత్త చుం డ్రు శ్రీహరిపై దాదాపు 59 వేల మెజా రిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత మద్యం తర ఎన్ని కల్లో 1991లో రా జమండ్రి నుంచే మళ్లీ పోటీ చేసినా, ఈసారి టీడీపీ అభ్యర్థి కె.వి.ఆర్ చౌదరిపై సుమారు 62 వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఎన్టీఆర్ కి సన్నిహితుడైన క్ యారెక్టర్ ఆర్టిస్టు కైకాల సత్యనారా యణ 1996లో మచిలీపట్నం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి గా గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి టీడీపీ నుంచి కాం గ్రెస్ కి మారినకె.పి.రెడ్డయ్యయాదవ్ . సత్యనారా యణ రెండోసారి 1998 మధ్యం తర ఎన్ని కల్లో మళ్లీ బరిలో దిగి, కాం గ్రెస్ అభ్యర్థి కావూరి సాం బశివరావుపై 81 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు