చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) - దేశ వ్యాప్తంగా ఉన్న 30 సీపెట్ కేంద్రాల్లో సీపెట్ అడ్మిషన్ టెస్ట్-2024 ద్వారా డిప్లొమా, పీజీ డిప్లొమా, పోస్ట్ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత : కోర్సును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రవేశ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ.100 చెల్లించాలి.
దరఖాస్తులు : అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్లో మే 31 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జూన్ 9న కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. కోర్సు ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం అవుతుంది. పూర్తి వివరాలకు www.cipet24.onlineregistrationform.org వెబ్సైట్లో సంప్రదించాలి.