
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 1226 (రెగ్యులర్-1100, బ్యాక్‌లాగ్-126)
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
వయసు: 1 డిసెంబర్ 2021 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 1 డిసెంబర్ 2000 - 2 డిసెంబర్1991 మధ్య జన్మించి ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌లైన్ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టెస్ట్), స్ర్కీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: రాత పరీక్షలో భాగంగా ఆబ్జెక్టివ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ 120 మార్కులకు ఉంటుంది. దీనిలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టెస్ట్‌కి నెగిటివ్ మార్కింగ్ లేదు. డిస్క్రిప్టివ్ టెస్ట్ 50 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ (లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్) నుంచి ప్రశ్నలు ఉంటాయి. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు: ఇతరులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. చివరి తేది: 29 డిసెంబర్ 2021
ఆన్‌లైన్ ఎగ్జామ్: జనవరి 2022.
వెబ్సైట్: www.sbi.co.in
సబ్జెక్ట్ మార్కులు
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30
బ్యాంకింగ్ నాలెడ్జ్ 40
జనరల్ అవేర్‌నెస్/ ఎకానమి 30
కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 20