న్యూఢిల్లీ: టెలికం ఎక్విప్‌మెంట్లను తయారు చేసే యూఎస్ కంపెనీ సిస్కో తమిళనాడులో ప్లాంట్ పెట్టే ఆలోచనలో ఉంది. కంపెనీ సీఈఓ చక్ రాబిన్స్ ఇండియాపై బుల్లిష్‌గా ఉన్నామని ప్రకటించారు. దేశంలో ఒక బిలియన్ డాలర్ల (రూ.8,200 కోట్ల) ను ఇన్వెస్ట్ చేస్తామని అన్నారు. డొమెస్టిక్ మార్కెట్ అవసరాలతో పాటు, ఎగుమతులపై కూడా సిస్కో ఫోకస్ చేస్తుందని వివరించారు. ప్రస్తుతం ఇండియా టూర్‌లో ఉన్న రాబిన్స్, వివిధ సిటీలలో పర్యటిస్తున్నారు. డిజిటైజేషన్‌లో ఇండియా మంచి గ్రోత్ రికార్డ్ చేసిందని, మరింత వృద్ధి చెందాలని చూస్తోందని అన్నారు.
‘రానున్న 12 నెలల్లోనే సిస్కో తమ మొదటి ప్రొడక్ట్‌ను ఇండియాలో తయారు చేస్తుంది. ఎక్కువగా అమ్ముడవుతున్న తమ రెండు ప్రొడక్ట్‌లను ఇక్కడ తయారు చేస్తాం. భవిష్యత్‌లో ప్రొడక్ట్‌ల రేంజ్ పెంచుతాం’ అని రాబిన్స్ వెల్లడించారు. కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్లు, పార్టనర్ల ద్వారా మాన్యుఫాక్చరింగ్ చేపడతామని అన్నారు. కానీ, తమిళనాడులో పెట్టే ప్లాంట్ కోసం ఎంత ఇన్వెస్ట్ చేస్తారనేది బయట పెట్టలేదు. సిస్కో తయారు చేసిన స్విచ్‌లు, రూటర్ల వాడకం ఇండియాలో బాగా పెరిగింది.