మా అమ్మ అక్కడే ఉంది.. అందుకే కంగనా రనౌత్‌ను కొట్టిన: కుల్విందర్ కౌర్

మా అమ్మ అక్కడే ఉంది.. అందుకే కంగనా రనౌత్‌ను కొట్టిన: కుల్విందర్ కౌర్

ఎంపీ కంగనా రనౌత్ పై చంఢీగర్ విమానాశ్రయంలో CISF మహిళా కానిస్టేబుల్ చేయిచేసుకున్న విషయం తెలిసిందే.. కంగనా ఎయిర్ పోర్ట్ లోకి వెళ్తంటే చెక్ పాయింట్ దగ్గర ఆమె చెంపపై కొట్టి, తిట్టిన CISF ఆఫీసర్ కుల్విందర్ కౌర్. గత ఆరు నెలల క్రితం రైతులు నిరసన చేస్తున్నప్పుడు కంగనా రనౌత్ ఓ ట్విట్ చేశారంటా.. ఆ ట్విట్ కారణంగా ఎంపీని కొట్టానని కౌర్ చెప్పారు. రైతు సంఘాలు నిరసన చేస్తుంటే వారు రూ.100 కోసం అక్కడ కూర్చొ్న్నారని కంగనా ఎక్స్ లో ట్విట్ చేసింది. ఆ ట్విట్ కౌర్ కు చాలా బాధ కలిగించిందట.. ఎందుకంటే నిరసన చేస్తున్న వారిలో ఆమె తల్లి కూడా ఉందని కౌర్ తెలిపారు. 

రైతుల నిరసనకు ఆమె సపోర్ట్ చేస్తున్నట్లు.. రూ.100 కోసం వారు అక్కడ కూర్చున్నారని అన్న మాటకే ఆమెపై దాడి చేశానని కౌర్ అన్నారు. ఈ ఘటనపై  సీనియర్ అధికారులతో కూడిన విచారణ కమిటి ఏర్పాటు చేశారు. అలాగే ఎంపీ కంగనా రనౌత్ పై దాడి చేసినందుకు కుల్విందర్ కౌర్ ని సస్పెండ్ చేశారు. ఈ దాడిపై కంగనా ఎక్స్ వేదికగా స్పందించి ఇలా అన్నారు. నేను క్షేమంగానే ఉన్నాను.. కానీ  పంజాబ్ లో హింస, ఉగ్రవాదం పెరిగిపోతుందని, దాన్ని మేము ఎలా కంట్రోల్ చేయాలని ఆంధోళన చెందుతున్నట్లు ఎక్స్ లో ట్విట్ చేశారు. జూన్ 7న పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరుగనున్న ఎన్డీయే సమావేశానికి హాజరవ్వడానికి గురువారం ఢిల్లీ  ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. అప్పుడే ఆ ఘటన జరిగింది.