టెన్త్ పాస్తో కానిస్టేబుల్​ జాబ్.. జీతం రూ. 21 వేల నుంచి 69 వేలు

టెన్త్ పాస్తో  కానిస్టేబుల్​ జాబ్.. జీతం రూ. 21 వేల నుంచి 69 వేలు

కానిస్టేబుల్/ డ్రైవర్​ కమ్​ పంప్​ ఆపరేటర్​ పోస్టుల భర్తీకి సెంట్రల్ ​ఇండస్ట్రియల్​ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) నోటిఫికేషన్​ జారీ చేసింది. పదో తరగతి లేదా మెట్రిక్యులేషన్​ పూర్తయిన పురుష అభ్యర్థులు ఆన్​లైన్​లో మార్చి 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టులు 1124: కానిస్టేబుల్/ డ్రైవర్​కమ్​ పంప్ ఆపరేటర్, డ్రైవర్​ ఫర్ ఫైర్​ సర్వీసెస్ 279 పోస్టులు(అన్​ రిజర్వ్​డ్–116, ఈడబ్ల్యూఎస్​–27, ఎస్టీ–41, ఎస్టీ–20, ఓబీసీ–75), కానిస్టేబుల్/ డ్రైవర్​845 పోస్టులు(అన్​ రిజర్వ్​డ్-344, ఈడబ్ల్యూఎస్​-84, ఎస్టీ-126, ఎస్టీ-63, ఓబీసీ-228).

ఎలిజిబిలిటీ: పదో తరగతి లేదా మెట్రిక్యులేషన్​ లేదా సమాన విద్యార్హతలతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి డ్రైవింగ్​ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. వయోపరిమితి 2025, మార్చి 4 నాటికి 21 నుంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి. ఎత్తు కనీసం 167 సెంటీమీటర్లు, ఛాతీ 8‌‌0 నుంచి 85 సెంటీమీటర్లు ఉండాలి. 
సెలెక్షన్​ ప్రాసెస్: ఫిజికల్​స్టాండర్డ్స్​టెస్ట్(పీఎస్ టీ), ఫిజికల్​ ఎఫిషియెన్సీ టెస్ట్​(పీఈటీ), డాక్యుమెంటేషన్​ వెరిఫికేషన్, ట్రేడ్​ టెస్ట్, రాత పరీక్ష, డిటైల్డ్​ మెడికల్​ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్​ ఎగ్జామినేషన్​ ఆధారంగా సెలెక్ట్​ చేస్తారు. 

శాలరీ: నెలకు రూ. 21,000 నుంచి రూ.69,100.

అప్లికేషన్​ ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం అభ్యర్థులు అప్లికేషన్​ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 
అప్లికేషన్​ లాస్ట్​ డేట్: 2025, మార్చి 4.