వంద స్మార్ట్ సిటీల నిర్మాణానికి మోడీ సర్కారు 2015 జూన్ లో ఓ మిషన్ ను అఫీషియల్ గా ఆరంభించింది. మొదటి బడ్జెట్ లోనే రూ.7,060 కోట్లు ఇచ్చింది. వచ్చే రెండేళ్లలో ఈ పథకం కింద 100 నగరాలను సెలెక్ట్ చేసి ఒక్కోదానికి రూ.500 కోట్ల సెం ట్రల్ గ్రాంట్ కేటాయిస్తామని తెలిపింది.కానీ.. ‘స్మార్ట్ సిటీ అంటే ఇదీ’ అని మాత్రం క్లియర్ గా చెప్పలేదు. నగరాల్లో జనానికి డీసెం ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని అందిం చటానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ఆయా సిటీల్ని ప్రమోట్ చేయటమే మిషన్ లక్ష్యమని వివరించింది.ఈ ఆబ్జెక్టివ్ లో భాగంగా ‘స్మార్ట్ సొల్యూషన్స్’తో క్లీన్, సస్టెయినబుల్ ఎన్విరా న్ మెంట్ ని సృష్టిస్తారు. ఈ కోర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో ప్రత్యేకంగా పేదల కోసం నీళ్లు, కరెంట్ సప్లయి, పారిశుద్ధ్యం, పొడిచెత్త మేనేజిమెంట్, ప్రజా రవాణా ఏర్పాటు చేస్తారు. అందుబాటు ధరల్లో ఇళ్లు కడతారు. స్మార్ట్ సొల్యూషన్స్‌లో ఎక్కువగా టెక్నాలజీ బేస్డ్ ఇంటర్వె న్షన్లు(పరికరాలు, సర్వీసులు) వగైరా ఉంటాయి. కెమెరా ల సాయంతో ట్రాఫిక్ ను; మొబైల్ అప్లికేషన్లు, జీపీఎస్ సాయంతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను మేనేజ్ చేయడం, కంట్రోల్ , రెగ్యులేట్ వంటివి చేస్తారు.ఈ నిర్మాణాలను ‘స్మార్ట్ సిటీలు’ అనటం కన్నా ‘స్మార్ట్ ఎన్ క్లే వ్ లు’ అనటం కరెక్ట్ అనిపిస్తోంది. ఈ పథకం వల్ల లబ్ధి పొందేవారు అతి తక్కువ మందే. ఎంపికైన నగరాల్లో లిమిటెడ్ ఏరియాలే డెవలప్ అవుతాయి. ఈ మాత్రానికే మిషన్ కి ఇచ్చి న నిధుల్లో 80 శాతం ఖర్చు చేయటం సరి కాదు. ఈ స్కీం లో బడుగు, బలహీన వర్గాల ప్రస్తావన లేదు. వాళ్లకు తక్కువ రేటుకి ఇళ్లు ఇచ్చే ఏర్పాటు చేయలేదు. అర్బన్ లోని పూర్ పీపుల్ కి,దారిద్ర్య రేఖకి దిగువ ఉన్న కుటుం బాలకు, కమ్యూని టీలకు పటిష్టమైన ప్లాన్ లు లేవు.స్మార్ట్ సిటీల నిర్మాణానికి కేం ద్రంతోపాటు రాష్ట్రాలు కూడా బడ్జెట్ కేటాయిం చాలి. ఫండ్ రైజిం గ్ లో రాష్ట్రాలకు, ముఖ్యం గా లోకల్ బాడీలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. యూజర్ ఛార్జీలు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ లు, ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్లు, మునిసిపల్ బాండ్ల జారీ, ఇతర పథకాల నిధుల సర్దుబాటు వంటి ఆప్షన్లు కల్పించింది. ఈ స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వాలు దుర్వి నియోగం చేస్తున్నాయి. అప్పుగా తీసుకుంటే వడ్డీల భారం పెరుగుతుందనో, లేక మరో కారణం చేతనో నిధుల సేకరణకు మార్కె ట్ బేస్డ్ ఫైనాన్స్ సోర్సె స్ పైన ఆధారపడటాన్ని తగ్గిస్తున్నాయి.దాదాపు 70 శాతం ఫండ్స్‌ని పబ్లిక్ వనరుల ద్వారానే కలెక్ట్ చేస్తున్నాయి. ఫలితంగా ప్రజలపై ఆర్థిక భారం పడుతోం ది. మహారాష్ట్ర లోని పుణె మునిసిపల్ కార్పొరేషన్ 2017 జూన్ లో జారీ చేసిన బాండ్ల వల్ల స్థానికంగా ట్యాక్స్‌లు, యూజర్ ఛార్జీలు అమాంతం పెరిగాయి. త్రిపురలోని ఉదయ్ పూర్ లో కరెంట్, వాటర్ ఛార్జీలను ఐదు రెట్లు చేశారు. స్మార్ట్ సిటీల అభివృద్ధి ముఖ్యంగా రెండు విధాలుగా జరుగుతుంది.ఒకటి.. ఏరియా బేస్డ్ గా, రెండోది.. పాన్ సిటీ వైజ్ గా చేపడుతున్నారు. ఏరియా బేస్డ్ డెవలప్ మెంట్ ప్రకారం నగరంలో అభివృద్ధి చెందే ప్రాంత శాతం ఒక్కో చోట ఒక్కోలా ఉంది.లక్ష ద్వీప్ లోని కవరత్తి వంటి సిటీలో అభివృద్ధి చెందే మొత్తం సిటీ పర్సం టేజీ 61 శాతం వరకు ఉండగా, పంజాబ్ లోని లూథియానాలో 0.3 శాతానికే పరిమితమైంది. దీన్ని బట్టి లబ్ధి పొందే జనాభా శాతాల్లోనూ విపరీతమైన వ్యత్యాసం చోటు చేసుకుంటోంది.అండమాన్ అండ్ నికోబార్ లోని పోర్ట్ బ్లెయిర్ లో 77 శాతం మంది ప్రజలు స్మార్ట్ సిటీల వల్ల లాభం పొందుతుండగా, పుణేలో 0.8 శాతం మందికే ప్రయోజనం కలుగుతోంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల ఇంప్లిమెంటేషన్ కోసం ఆయా సిటీ లు ‘స్పెషనల్ పర్పస్ వెహికిల్ (ఎస్ పీవీ)’ని ఏర్పాటు చేయాలి. కానీ, యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జేఎన్ ఎన్ యూఆర్ ఎంలో భాగంగా ఇప్పటికే ఎస్ పీవీలు ఏర్పాటయ్యాయి. ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఒక్కో ప్రాజెక్టు కోసం ఒక్కో కంపెనీ తెరపైకి వస్తోంది. వాటి మధ్య కో–ఆర్డినేషన్ ఉండట్లేదు. ‘ఎవరి దారి వారిదే’ అన్నట్లు వ్యవహరిస్తున్నా యి. ఈ కంపెనీ బోర్డుల్లో కేంద్ర , రాష్ త్ర ప్రభుత్వాలతో పాటు మునిసిపల్ కార్పొరేషన్, ఫైనాన్స్ సంస్థల తరఫున నామినీలు ఉంటారు. స్మార్ట్ సిటీల కోసం ఏర్పాటు చేసే ఎస్ పీవీలో ఎలెక్టెడ్ రిప్రజెం టేటివ్ ఎవరూ ఉండరు. ఫలితంగా ప్రాజెక్టు అమలులో ఎస్ పీవీకి , మునిసి పల్ కార్పొరేషన్ కి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నా యి. సర్కారు సొమ్ము ఖర్చు లకు జవాబుదారీ ప్రజాప్రతినిధే. వాళ్లకే తెలియకుం డా గవర్నమెంట్ ఫండ్స్‌ని వాడుతుండ టం వల్ల కొత్త చిక్కు లు వస్తున్నా యి. పుణేలో ఇలాగే వివాదం తలెత్తితే ప్రజలు ఎన్నుకున్న నాయకుడికి బోర్డులో నామినేషన్ ఇచ్చారు. ఈ లోటు పాటులన్నింటినీ సరిచేస్తే తప్ప స్మార్ట్ సిటీల నిర్మాణం వేగం పుంజుకోదు.
సిటీలు స్మార్ట్ గా మారలేదు!
- వెలుగు ఓపెన్ పేజ్
- February 24, 2019
లేటెస్ట్
- రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్లో ఉన్నయ్: ఎమ్మెల్సీ కవిత
- కౌశిక్ రెడ్డిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాం: మంత్రి శ్రీధర్ బాబు
- జనవరి 26 నుంచి రైతు భరోసా.. రైతుల అకౌంట్లోకి రూ. 12 వేలు: పొంగులేటి
- జనవరి- 26 నుంచి రేషన్ కార్డుల పంపిణీ: మంత్రి ఉత్తమ్
- Game Changer: గేమ్ ఛేంజర్ డే2 కలెక్షన్స్.. రెండో రోజు ఎన్ని వచ్చాయంటే..?
- రాత్రంతా శనగలు ఉడికించారు.. ఏ ప్రమాదం జరగలేదు.. కానీ చనిపోయారు.. కారణం..
- IPL 2025: మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025.. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ అధికారిక ప్రకటన
- ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్ నగరాలు.. టాప్ 5 లో మూడు మనవే..
- ప్రమాదం జరిగిన వెనక్కి తగ్గలే: దుబాయ్ కార్ రేసింగ్‌లో మూడోస్థానంలో అజిత్ టీమ్
- Kapil Dev: కపిల్ దేవ్‌ను చంపడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను: యువరాజ్ సింగ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
Most Read News
- Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ టాక్ వచ్చేసింది.. సంక్రాంతి విన్నరో.. కాదో.. తేలిపోయింది..
- IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- పదేళ్ల సర్వీస్‌కు EPS ప్రకారం ఎంత పెన్షన్ వస్తుంది..?
- హైదరాబాద్ లోని ఈ ఏరియాల్లో రేపు, ఎల్లుండి ( జనవరి 13, 14 ) వాటర్ సప్లయ్ బంద్
- హైదరాబాద్ సిటీలో కల్లు తాగేటోళ్లకు బ్యాడ్ న్యూసే ఇది..
- Daaku Maharaj Review: బాలకృష్ణ డాకు మహారాజ్ రివ్యూ. ఎలా ఉందంటే..?
- 23 ఏళ్ళ తర్వాత మళ్ళీ హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తున్న మన్మధుడు మూవీ హీరోయిన్..
- మా భార్య చాలా గొప్పది.. చూడటానికి ఇష్టపడతా.. వారంలో 90 గంటల పనిపై ఆనంద్ మహీంద్ర కామెంట్స్..
- మిర్యాలగూడ ప్రణయ్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్