2024లో 20వేల మంది తమ సంస్థ ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్ ప్రకటించింది. కంపెనీ పునర్వవస్థీకరణలో భాగంగా రాబడులను పెంచేందుకు వాల్ స్ట్రీట్ దిగ్గజం సిటీ గ్రూప్ 2024లో ఉద్యోగాలను తగ్గించే అవకాశం ఉందని పేర్కొంది.
బ్యాంక్ నాల్గవ త్రైమాసికంలో 1.8 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. దాని స్థిర ఆదాయ వ్యాపారం నుంచి రాబడిలో 25 శాతం తగ్గుదల , కొన్ని బ్యాంక్ వైఫల్యాల కారణంగాFDIC ఫండ్ ను తిరిగి నింపడం కారణంగా నష్టం వాటిల్లింది. బ్యాంక్ క్రమబద్దీకరణ, 2027 నాటికి కనీసం 11 శాతం వరకు స్పష్టమైన సాధారణ ఈక్విటీపై దాని రాబడిని మెరుగు పర్చడం లక్ష్యంగా 2023 సెప్టెంబర్ లో భారీ మార్పులు మొదలుపెట్టిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రేజర్ తెలిపాడు.