రిటైర్డ్ ఐపీఎస్​వీకేసింగ్ నేతృత్వంలో సిటిజన్​ఫోరం తెలంగాణ

రిటైర్డ్ ఐపీఎస్​వీకేసింగ్ నేతృత్వంలో సిటిజన్​ఫోరం తెలంగాణ

ఖైరతాబాద్, వెలుగు: సమాజానికి తమ వంతు సేవలు అందించేందుకు ‘సిటిజన్ ఫోరం తెలంగాణ’ ఏర్పాటు చేసినట్లు రిటైర్డ్​ఐపీఎస్​ఆఫీసర్ వీకే సింగ్ ప్రకటించారు. గురువారం ఆయన సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో రిటైర్డ్​ఐపీఎస్​ఆఫీసర్​ఆర్పీ సింగ్, రిటైర్డ్​ఐఆర్ఎస్​ ఆఫీసర్లు బీవీ గోపీనాథ్, కె.వి.నరసింహాచార్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. 

ప్రజలకు,ప్రభుత్వానికి వారధిగా సిటిజన్​ఫోరం పనిచేస్తుందన్నారు. విద్య, వైద్యం ఇతర సేవలు సక్రమంగా అందేలా కృషి చేస్తామన్నారు. గ్రామ స్థాయి నుంచి ప్రతి నిధి కమిటీలు ఏర్పాటు చేసి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని వెల్లడించారు. సమావేశంలో డాక్టర్​పి.శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.