సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు ఫెయిల్ : అన్నమొల్ల కిరణ్

సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు ఫెయిల్ : అన్నమొల్ల కిరణ్

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీఐటీయూ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్​ మండిపడ్డారు. పంచాయతీ కార్మికులు, మున్సిపల్​ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టరేట్​ ముందు ధర్నా చేశారు. 

కాంట్రాక్ట్​ విధానాన్ని రద్దు చేసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పెండింగ్​లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలన్నారు. లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.