కార్మికుల సమస్యలు పట్టించుకోని గుర్తింపు సంఘం

 కార్మికుల సమస్యలు పట్టించుకోని గుర్తింపు సంఘం

కోల్​బెల్ట్, వెలుగు:​ సింగరేణి కార్మికుల సమస్యలను గుర్తింపు సంఘం ఏఐటీయూసీ పట్టించుకోవడం లేదని ఫలితంగా స్ట్రక్చర్​ మీటింగ్​ను కోల్పోవాల్సి వచ్చిందని సీఐటీయూ బ్రాంచి ప్రెసిడెంట్​ఎస్.వెంకటస్వామి అన్నారు. ఆదివారం రామకృష్ణాపూర్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 

సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలిచిన తొమ్మిది నెలలు గడిచినా.. ప్రతి నెలా రెండో మంగళవారం కార్మికుల సమస్యలపై చర్చించాల్సిన ఏరియా లెవల్ స్ట్రక్చర్​సమావేశాలను పట్టించుకోవడంలేదన్నారు. లాభాల వాటా విషయంలో విఫలమైందన్నారు. కాసిపేట గ్రూప్​గనులకు వెళ్లే రహదారి బాగాలేదని, స్ట్రీట్​ లైట్లు లేక డ్యూటీకి వెళ్లే సింగరేణి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. కేకే1 డిస్పెన్సరీలో 

పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకరావాలని, ఆస్పత్రిని ఆప్​గ్రేడ్​ చేయాలని డిమాండ్​చేశారు. సింగరేణి క్వార్టర్లలో ఉంటున్న కార్మికేతరులను ఖాళీ చేయించాలని కోరారు. కార్మికులపై పనిభారం, ఒత్తిడి తగ్గించాలన్నారు. సమావేశంలో సీఐటీయూ బ్రాంచి జనరల్ ​సెక్రటరీ అల్లి రాజేందర్​తదితరులు పాల్గొన్నారు.