పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాలి : సీఐటీయూ 

పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాలి : సీఐటీయూ 

సంగారెడ్డి టౌన్, వెలుగు: పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డి లోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏవో పరమేశ్వర్ కు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్​మాట్లాడుతూ.. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కార్మికుల వేతనాలు కూడా పెంచాలన్నారు.

గత ప్రభుత్వం 2021 జూన్ లో ఐదు రంగాల షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్ కనీస వేతనాలు సవరిస్తూ ఫైనల్ నోటిఫికేషన్లు ఇచ్చారని, యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో గెజిట్ చేయకుండా కార్మికులకు అన్యాయం చేసిందన్నారు. ఆందోళన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశ్, కార్యదర్శి సాయిలు, నాయకులు రాజయ్య, భాగారెడ్డి, యాదగిరి, ప్రవీణ్, కొండల్ రెడ్డి, ప్రసన్నారావు, సురేశ్, శ్రీనివాస్, రాందాస్, రమేశ్, రాములు, భీమ్ రెడ్డి, శివ ఉన్నారు.

 భగీరథ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి

మిషన్ భగీరథ కార్యక్రమంలో తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు కాకపోవడం సిగ్గుచేటని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు ఆరోపించారు. సంగారెడ్డి లోని సుందరయ్య భవన్​లో మిషన్ భగీరథ కార్మికుల జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు.

సాయిలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా రూ. 9వేల  నుంచి రూ.11 వేల వరకు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ.26000 చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుధాకర్, రాములు, కృష్ణ, వెంకటేశ్, ప్రభాకర్, నర్సింలు, సుదర్శన్, రాజు పాల్గొన్నారు.