సింగరేణి కార్మికుల హక్కులను తాకట్టు పెట్టిన సంఘాలకు బుద్ధి చెప్పాలన్న నాగరాజ్​గోపాల్

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికుల హక్కులను యాజమాన్యానికి తాకట్టుపెట్టిన కార్మిక సంఘాలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సీఐటీయూ డిప్యూటీ జనరల్​సెక్రటరీ నాగరాజ్​గోపాల్​పేర్కొన్నారు. గురువారం మందమర్రి ఏరియా కాసిపేట-2 బొగ్గు గనిపై నిర్వహించిన గేట్​మీటింగ్​లో ఆయన మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి సీఐటీయూ అనుసరిస్తున్న విధానానికి ఆకర్శితులై యువ ఉద్యోగులు స్వచ్ఛందంగా యూనియన్​లోకి వస్తున్నారని చెప్పారు.

మందమర్రి ఏరియాలో గత ఎన్నికల్లో ఏఐటీయూసీని గెలుపించుకుంటే వాళ్లు టీబీజీకేఎస్​తో కలిసి పైరవీలకు పాల్పడ్డారని ఆరోపించారు. కార్మికుల హక్కులు కాపాడటం సంఘాలకే సాధ్యమన్నారు. ఎలాంటి సమస్యనైనా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే సత్తా ఉన్న సీఐటీయూని గెలిపించాలని కోరారు.

ఈ సమావేశంలో యూనియన్ బ్రాంచి ప్రెసిడెంట్​ఎస్.వెంకటస్వామి, సెక్రటరీ అల్లి రాజేందర్, ఉపాధ్యక్షుడు రామగిరి రామస్వామి, గని పిట్ సెక్రటరీ బుద్దే సురేశ్, లీడర్లు వడ్లకొండ ఐలయ్య, అలవాల సంజీవ్, అయిందాల శ్రీనివాస్, సంకె వెంకటేశ్, మహమ్మద్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.