- కలెక్టరేట్ ఎదుట సీఐటీయు ధర్నా
కరీంనగర్ టౌన్, వెలుగు: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్ డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో ధర్నా చేసి, కలెక్టర్ పమేలాసత్పతికి వినతిపత్రం ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా జీపీల్లో పనిచేస్తున్న కార్మికులకు 3 నెలల నుంచి 12 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు.
వెంటనే జీతాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, రూ.10లక్షల ప్రమాదభీమాతో పాటు వారంతపు సెలవులు ఇప్పించాలన్నారు. లేకుంటే సమ్మె పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు లు రాచర్ల మల్లేశం, కోశాధికారి ఇండికా రవీందర్రావు, శంకర్, మహిపాల్, ప్రేమ్ కుమార్, సారయ్య, వడ్లూరి లక్ష్మీనారాయణ, చంద్రయ్య లక్ష్మి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.