రాజాపేట, వెలుగు: అంగన్‌వాడీలకు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బూరుగు స్వప్న అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో దేశవ్యాప్త సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోత విధిస్తూ ఐసీడీఎస్‌ను నిర్వీర్యం విమర్శించారు. కార్మికులు కొట్లాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దుచేసి యాజమాన్యాలకు అనుకూలండా ఏండే నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16 న దేశ వ్యాప్త కార్మిక సమ్మెను, గ్రామీణ బంద్‌ను నిర్వహించనున్నామని చెప్పారు.
కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పశుమిత్ర యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి, మిషన్ భగీరథ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి సంపత్, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు భూలక్ష్మి, శోభ, గౌరమ్మ, సరిత పాల్గొన్నారు.