
సంగారెడ్డి టౌన్, వెలుగు : ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు అన్నారు. గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆటోడ్రైవర్ల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలన్నారు. ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పిల్లల చదువులు, పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
కేరళలో అమలు చేస్తున్న విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బాబురావు, శేఖర్, మాణిక్యం, ప్రవీణ్, ప్రభు, రామకృష్ణ తదితరులు ఉన్నారు.