ధర్నా చౌక్​లో 48 గంటల దీక్ష ప్రారంభం

ధర్నా చౌక్​లో 48 గంటల దీక్ష ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: మిడ్​డే మీల్స్​వర్కర్స్​కు రూ.10 వేల జీతం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.బ్రహ్మచారి డిమాండ్​చేశారు. కలెక్టరేట్​ఎదుట మిడ్​డే మీల్స్​వర్కర్స్​చేపట్టిన 48 గంటల దీక్షను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిడ్​డే మీల్స్​వర్కర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్​చేశారు. మధ్యాహ్న భోజనం మెనూ చార్జీలు పెంచాలన్నారు.

ప్రతి కార్మికురాలికి రూ.10లక్షలు ఇన్సూరెన్స్​కల్పించాలన్నారు. ఏడాదికి రెండు జతల కాటన్​చీరలు ఇవ్వాలని, గ్యాస్​పంపిణీ చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ, మిడ్​డే మీల్స్​వర్కర్స్ యూనియన్​నేతలు ఏజే రమేశ్, జి.పద్మ, సుల్తానా, పి.అర్జున్, రవికుమార్, సత్య, భూక్య రమేశ్, రామలక్ష్మి, వెంకట నర్సమ్మ, నరసమ్మ, సమ్మక్క, నాగమణి పాల్గొన్నారు.