డబుల్​బెడ్​ రూమ్​ ఇళ్ల కోసం ఆందోళన

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో అర్హులైన ప్రతీఒక్కరికి డబుల్​బెడ్​ఇళ్లు కట్టివ్వాలని కోరుతూ సోమవారం సీపీఎం, సీఐటీయూ లీడర్లు కలెక్టరేట్​ఎదుట ఆందోళన నిర్వహించారు. వందలాది కార్యకర్తలు నినాదాలు చేస్తూ కలెక్టరేట్​లో దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

Also Read : తిర్యాణిలో తాగునీటి కష్టాలు

కలెక్టర్​ను కలవాలని కోరగా నలుగురిని మాత్రమే అనుమతించారు. సీఐటీయూ కార్యదర్శి నూర్జహాన్​ మాట్లాడుతూ.. పేదలకు 125 గజాల స్థలం ఇచ్చి, ఇళ్లు నిర్మించుకోవడానికి 
రూ.6 లక్షలు ఇవ్వాలని డిమాండ్ ​చేశారు.