మధిర, వెలుగు : మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలను, బిల్లులు వెంటనే చెల్లించాలని మధిర ఎంపీడీవో ఆఫీస్ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు శీలం నరసింహారావు మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికులకు నాలుగు నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని, పెంచిన రూ.3 వేల జీతం కూడా ఇవ్వడం లేదని, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని, వంట సామగ్రి ఇవ్వాలని, వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండవ ఫణీంద్ర కుమారి, పడకంటి మురళి, రామ నరసయ్య, మంద సైదులు, మద్దాల ప్రభాకర్, తేలబ్రోలు రాధాకృష్ణ, మధు, విల్సన్, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.