కోల్బెల్ట్, వెలుగు: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను కార్మికవర్గం భారీ మోజార్టీతో గెలిపించాలని సీఐటీయూ స్టేట్ ప్రెసిడెంట్ దూలం శ్రీనివాస్ కోరారు. వంశీని గెలిపిస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. ఆదివారం మందమర్రిలోని సీఐటీయూ ఆఫీస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్ కార్మికవర్గాన్ని కట్టుబానిసలుగా చేసే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం, కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. కార్మికుల హక్కలు, డిమాండ్లు, చట్టాలను నిర్వీర్యం చేసే బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలన్నారు. సమావేశంలో ఎస్ అండ్ పీసీ ప్రైవేటు సెక్యూరిటీ గార్డు కమిటీ కార్యదర్శి జిల్లా రాజు, కోశాధికారి దాసరి నరేశ్, సహాయ కార్యదర్శి దుర్గం రవీందర్, కమిటీ సభ్యులు కూకట్ల శ్రీనివాస్, ఆర్.సుదర్శన్, సీహెచ్.వెంకటేశ్, మంద సతీశ్ తదితరులు పాల్గొన్నారు.