కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తాం

సూర్యాపేట, వెలుగు : ప్రధాని మోదీ కార్మిక వ్యతిరేక విధానాలపై ఫిబ్రవరిలో దేశ వ్యాప్తంగా పోరాటం చేస్తామని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు అన్నారు. శనివారం సూర్యాపేటలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ కాలంలో పోరాడి సాధించుకున్న 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్లను తెచ్చారని, 8 గంటలు పని దినాలను తిరిగి 12 గంటలు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికులను ఐక్యం చేసి దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని తెలిపారు.