- సమస్యలు పరిష్కరిస్తామన్న యాజమాన్యం
కామారెడ్డి టౌన్, వెలుగు: కార్మికుల నుంచి దేశాయి బీడీ కంపెనీ యాజమాన్యం ఏటా రూ.20 కోట్లు వసూలు చేస్తోందంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వి రమ, జిల్లా అధ్యక్షుడు కందూరి చంద్రశేఖర్ మాట్లాడారు. కార్మికులు ధర్నాలో పాల్గొనకూడదని కంపెనీ యాజమాన్యం వారిని భయబ్రాంతులకు గురిచేసిందని ఆరోపించారు.
రూ.వెయ్యికి రూ. 10 చొప్పున కంపెనీ వసూలు చేస్తోందని, కురుకురే ప్యాకెట్లను కార్మికులు కొనాలని బలవంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమం లో సీఐటీయూ నాయకులు బాలమణి, ఎస్.వెంకట్ గౌడ్, కొత్త నరసింహులు, అరుణ్, శ్రీహరి, రాణి, భాగ్యమ్మ, రేణుక, లక్ష్మి, ప్రేమలత, జ్యోతి, సత్యం, రాజనర్సు, వాణి, మంజుల తదితరులు పాల్గొన్నారు.