సికింద్రాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదాలకు అవగాహన రాహిత్యమేనని కారణమని నగర అడిషనల్ సీపీ విశ్వప్రసాద్అన్నారు. సోమవారం బేగంపేట్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడ్డ వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ట్రాఫిక్ నియమాలపై అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపరాదన్నారు. మద్యం తాగితే ఆటో లేదా వేరే ఏదైనా ట్రాన్స్పోర్ట్ వాహనంలో వెళ్లాలని సూచించారు. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి వివరించారు. ప్రతి సిటిజన్ కి ట్రాఫిక్ రూల్స్, రెగ్యులేషన్స్ గురించి తప్పకుండా తెలిసి ఉండాలన్నారు. దీని వల్ల చాలా వరకు రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చన్నారు. ప్రోగ్రాంలో సుమారు 250 మంది ట్రాఫిక్ ఉల్లంఘించిన వారు పాల్గొనగా.. వారికి శిక్షల గురించి వివరించారు. కార్యక్రమంలో నార్త్ జోన్ ఏసీపీ జి. శంకర్‌రాజు, బేగంపేట టీటీఐ ఇన్‌స్పెక్టర్ రాంచందర్, బేగంపేట
ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పాపయ్య పాల్గొన్నారు.