
స్పీడ్‌గా సర్వీసింగ్ పనులు.. బస్సుల రీస్టార్ట్‌కి ఆర్టీసీ ఏర్పాట్లు
సర్కారు పర్మిషన్ కోసమే వెయిటింగ్
సవాల్‌గా మారిన ఫిజికల్ డిస్టెన్స్
ఆల్టర్నేటివ్ సీటింగ్ అమలుకు ప్లాన్
హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ డిపోలకు పరిమితమైన ఆర్టీసీ బస్సులు అన్ లాక్‌తో ఏ క్షణానైనా రోడ్డెక్కేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నెల 7 నుంచి మెట్రో రీస్టార్ట్ అవనుండడంతో సిటీ బస్సులకు కూడా సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే చాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన వెంటనే బస్సులు నడిపేందుకు వీలుగా రిపేర్, సర్వీసింగ్ పనులు చేస్తున్నారు. సిటీలోని 29 డిపోల్లోనూ ఈ పనులు సాగుతున్నాయి. లాక్ డౌన్ రోజుల్లో సిటీలో స్పెషల్ బస్సులు మాత్రమే నడుపుతుండగా, అన్‌లాక్ 4లో పూర్తి స్థాయిలో బస్సులను డిపోల నుంచి బయటకు తెచ్చేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంటోంది. సిటీలో ఉన్న 3,700 బస్సుల్లో అధికారులు ఇప్పటికే కొన్నింటిని కార్గో సర్వీసెస్‌కి ఉపయోగిస్తున్నారు. అవిపోగా, మిగిలిన వాటితో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ తిరిగి ప్రారంభించనున్నారు. మెట్రో ట్రైన్ ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం బస్సులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని భావించి ముందస్తుగా అన్ని పనులూ పూర్తిచేసుకుంటున్నారు. ఇంజిన్ కండిషన్, రిపేర్లు, విడి భాగాల ఫిట్టింగ్, ఫిజికల్ డిస్టెన్స్ ఉండేలా ఏర్పాట్లు చేసే పనిలో ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు.
55ఏండ్లు పైబడిన వాళ్లు 10వేల మందికిపైనే..
మెట్రోకు పర్మిషన్ వచ్చిన తర్వాత సిటీ బస్సులు తిరిగి స్టార్ట్ చేయడంపై సిబ్బందిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెట్రో తరహాలో ఫిజికల్ డిస్టెన్స్, రద్దీ నియంత్రణకు బస్సులు, బస్టాండ్ల వద్ద చాన్స్ లేకపోవడంతో ఉద్యోగులు ఆలోచనలో పడ్డారు. కొందరు డ్రైవర్లు, కండక్టర్లు టెన్షన్ పడుతున్నారు. మరికొందరు డ్యూటీకి రెడీ అవుతున్నారు. సిటీలో 55ఏండ్ల పైబడిన కండక్టర్లు, డ్రైవర్ల సంఖ్య 10వేలకిపైగా ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో డ్యూటీ చేయాలంటే భయంగానే ఉందని ఉప్పల్ డిపోకి చెందిన ఓ కండక్టర్ తెలిపారు.
రద్దీ కంట్రోల్ సాధ్యమయ్యేనా?
జిల్లాల నుంచి వచ్చే బస్సుల తరహాలో సిటీలో రద్దీ నియంత్రణ సాధ్యమవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రయాణికులే వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలని ఆర్టీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అన్ని రూట్లలో బస్సులు, టైమింగ్, పరిమితి సంఖ్యలో సీటింగ్ తదితర అంశాలపై అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
For More News..