- గోల్డెన్ అవర్స్‌లో రూ.39 లక్షలు ఫ్రీజ్
హైదరాబాద్, వెలుగు: స్టాక్స్, ట్రేడింగ్పేరుతో సైబర్ నేరగాళ్లు కొట్టేసిన రూ.39లక్షలను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్‌చేశారు. గోల్డెన్ అవర్స్‌లో స్పందించిన బాధితుడికి గంటల వ్యవధిలో అప్పగించారు. డీసీపీ కవిత తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన ఓ యువకుడి ఫోన్‌కు ఇటీవల స్టాక్స్, ట్రేడింగ్ పేరుతో ఓ లింక్ వచ్చింది. ట్రేడింగ్‌తో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందొచ్చని అందులో ఉంది. స్పందించిన యువకుడు రూ.78,70,500 ఇన్వెస్ట్ చేశాడు.
ఎలాంటి లాభాలు రాకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు వెంటనే 1930 నంబర్‌తోపాటు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ మధుసూదన్ రావు టీమ్ బ్యాంక్ అకౌంట్స్ ఆధారంగా ఆయా బ్యాంక్ అధికారులను అప్రమత్తం చేసింది. రూ.39 లక్షలు సైబర్ నేరగాళ్ల అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ కాకుండా ఫ్రీజ్ చేసింది. బాధితుడితో నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయించి ఫ్రీజింగ్ అమౌంట్‌ను బాధితుడి అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యేలా చేసింది.