హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ఫుడ్ సర్వీసెస్ ఇండస్ట్రీ మార్కెట్ పరిమాణం రూ. 10,161 కోట్లకు చేరిందని, సంఘటిత ఆహార సేవా రంగంలోని టాప్– 21 సిటీల్లో ఆరో స్థానంలో ఉందని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) వెల్లడించింది. సంస్థ హైదరాబాద్‌లో గురువారం విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. నగరంలో మొత్తం 74,807 రెస్టారెంట్లు (ఆర్గనైజ్డ్ + అసంఘటిత) ఉన్నాయి.
సిటీజనంలో 50శాతం మంది కంటే ఎక్కువ హోటళ్లలో తినేందుకు ఇష్టపడుతున్నారు. 2024-–2028లో ఆహార సేవల రంగం ఏటా 8.1శాతం వృద్ధి చెందుతుంది. ఇది భారతదేశంలోని మూడవ అతిపెద్ద పరిశ్రమ. మార్కెట్ విలువ 5.69 లక్షల కోట్లకు చేరింది. దేశ జీడీపీకి 1.9శాతం తోడ్పడుతుంది. ఇది 2028 నాటికి 7.76 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. ఫుడ్ సర్వీసెస్ పరిశ్రమ ఈ ఏడాది రూ.33,809 కోట్ల పన్నులు చెల్లించింది.
2028 నాటికి వీటి విలువ రూ.55,594 కోట్లకు చేరుకుంటుంది. భారతదేశం 2028 నాటికి జపాన్‌ను అధిగమించి 3వ అతిపెద్ద ఆహార సేవల మార్కెట్‌గా అవతరిస్తుందని ఎన్ఆర్ఏఐ వెల్లడించింది.