
హైదరాబాద్: తెలంగాణ ప్లేయర్ సహజ కెరీర్‌లో నాలుగో ఇంటర్నేషనల్ టైటిల్‌ను సాధించింది. సోమవారం లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఐటీఎఫ్ టోర్నీ ఫైనల్లో సహజ 6–4 (7–6 (7/4)తో జు అమీ (అమెరికా)పై గెలిచింది. తాజా విజయంతో ప్రొఫెషనల్ ర్యాంకింగ్స్‌లో సహజ 300వ ర్యాంక్‌కు చేరుకుంది. అయితే ఇండియా ర్యాంకింగ్స్‌లో రెండో ప్లేస్‌లో ఉన్న ఆమె.. తెలంగాణ టాప్ ప్లేయర్‌గా నిలిచింది.