సిరిసిల్ల, టౌన్ వెలుగు : గతంలో 34 రోజుల జీపీ కార్మికుల సమ్మె లో భాగంగా రాష్ట్ర జేఏసీని చర్చలకు పిలిచి, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. కార్మికులను మోసం చేసిందని సీఐటీయూ జనరల్ సెక్రటరీ అన్నదాస్ గణేశ్ అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో జీపీ కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
6 నెలలుగా వేతనలు చెల్లించకుండా.. కేటీఆర్ తమ ప్రభుత్వం గురించి గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్యాల నర్సయ్య, యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి మొర అజయ్, మండల అధ్యక్షులు బూర శ్రీనివాస్ , లింగంపెల్లి కృష్ణవేణి
పాల్గొన్నారు.