హత్య కేసు నిందితులను 24 గంటల్లో అరెస్టు చేసిన సిటీ పోలీసులు

హత్య కేసు నిందితులను 24 గంటల్లో అరెస్టు చేసిన సిటీ పోలీసులు

రెండు రోజుల క్రితం చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యకు సంబంధించిన నిందితులను 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నామని సుల్తాన్ బజార్ ఏసీపీ దేవేందర్ తెలిపారు. రౌడీ షీటర్ సయిద్ సాజిద్ చాచు హత్యకు సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్ల ఆయన తెలిపారు. వీరందరికీ మృతుడు సాజిద్ తో పాతస్నేహం ఉంది. గతంలో వీరి మధ్య జరిగిన గొడవల వల్ల కక్ష పెంచుకొని ఆరుగురు కలిసి సాజిద్ ను శనివారం రాత్రి ఆజాంపురా చమాన్ వద్ద కత్తులతో పొడిచి హత్యచేసి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మూడు టీములుగా ఏర్పడి ముమ్మర దర్యాప్తుతో 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతుడు సాజిద్ పై అనేక కేసులు నమోదై ఉన్నాయి. చాదర్ ఘాట్ పోలీసులు సాజిద్ ను ఇటీవలే పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ మరుసటి రోజే సాజిద్ హత్యకు గురయ్యాడు. హత్య చేసిన నిందితులంతా.. గంజాయి, వైట్ నర్, సొల్యూషన్ పీలుస్తూ.. మత్తుకు బానిసలై ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని ఏసీపీ తెలిపారు.

For More News..

ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలి

సముద్రగర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టును ప్రారంభించిన మోడీ

తెలంగాణలో మరో 1256 కరోనా కేసులు