హైదరాబాద్ సిటీ, వెలుగు: సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నలుగురిపై సిటీ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సంధ్య థియేటర్ వివాదంలో నటుడు అల్లు అర్జున్ జైలుకెళ్లిన విషయంలో కొంతమంది ఆకతాయిలు సీఎంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారు.
దీనిపై అంబర్ పేటకు చెందిన టీపీసీసీ సోషల్ మీడియా స్టేట్ సెక్రెటరీ కైలాష్సజ్జన్, రాజ్ కిరణ్ సోమవారం సైబర్క్రైమ్పోలీసులు ఫిర్యాదు చేశారు. నలుగురిపై ఐటీ యాక్ట్ 67, సెక్షన్ 352 ,353(1)(బి) ప్రకారం కేసులు నమోదు చేసినట్లు సైబర్క్రైమ్పోలీసులు తెలిపారు.